ఆక్వా వ్యాపారులు, ఉద్యాన పంటల రైతుల సమస్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు, రాయలసీమకు చెందిన ఉద్యాన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆక్వా మేత, ఐస్ కొరత, మార్కెటింగ్ సదుపాయం లేక.. ఆక్వా రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందన్నారు. చీనీ, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సదుపాయం లేక రైతులు అవస్థలు పడుతున్నారని లేఖలో రాశారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
సీఎం జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ - corona effect on ap crops
ఆక్వా ఉత్పత్తులు, ఉద్యానపంటల తరలింపు ఇబ్బందిగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
సీఎం జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ