గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కాలయాపన చేసిందని... ప్రస్తుత ప్రభుత్వం అమ్మేసిందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అక్కడి భూములను నచ్చిన వారికి అమ్ముతామని వైకాపా నేతలు చెబుతున్నారనీ... రైతులందర్నీ జగన్ నిట్టనిలువునా ముంచుతారని ఎవరూ ఊహించలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ అప్పట్లో అన్ని ప్రాంతాల్లో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రాంత రైతులు త్యాగం చేశారని కేంద్రం పన్ను చెల్లింపు మినహాయింపులు ఇచ్చిందని పేర్కొన్నారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని విమర్శించారు.
'రైతులను సీఎం జగన్ నిలువునా ముంచారు' - వైకాపా ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు
అమరావతికి మద్దతుగా ఉద్దండరాయునిపాలెంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో గంటపాటు నిరసన చేపట్టారు. ఆయనతోపాటు ఆ పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ