ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు: కన్నా లక్ష్మీనారాయణ - amaravati news

ప్రభుత్వ నిరంకుశ విధానాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర భవిష్యత్తును చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు.

Kanna Lakshmi Narayana
Kanna Lakshmi Narayana

By

Published : Jul 4, 2020, 3:08 PM IST

మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 200రోజుకు చేరిందన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. అమరావతి పోరాటానికి రాష్ట్ర భాజపా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతుందంటూ ట్వీట్ చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details