రాజధాని తరలింపు ప్రతిపాదన సరికాదని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టొద్దని కోరారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి అభివృద్ధికి 6 వేల కోట్లు ఖర్చుపెడితే 53 వేల కోట్ల సంపద వస్తుందని వివరించారు. వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఈ 7నెలల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. అపోహలు సృష్టించి అమరావతిని ఎడారి చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని తరలింపుపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్పందించాలని కనకమేడల పిలుపునిచ్చారు. స్పందించకపోతే వారి బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలను అంధకారంలోకి నెట్టొద్దు: కనకమేడల - kanakamedala on three capitals
వచ్చే ఐదేళ్లలో అమరావతి అభివృద్ధికి 6 వేల కోట్లు ఖర్చుపెడితే 53 వేల కోట్ల సంపద వస్తుందని... తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వివరించారు. వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఈ 7నెలల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు.
అమరావతిపై కనకమేడల వ్యాఖ్యలు