ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Khaloji Notification: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

By

Published : Mar 27, 2022, 12:18 PM IST

ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తెలంగాణలోని కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వెల్లడించింది.

కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం
కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం

తెలంగాణలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇవాళ్టి నుంచి మొదటివిడత వెబ్‌కౌన్సిలింగ్‌ జరగనుంది. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. మెరిట్ జాబితా, సీట్ల వివరాలను కాళోజి వర్శిటీలో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ABOUT THE AUTHOR

...view details