ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పరమ వీర చక్ర ఇచ్చి ఉంటే పూర్తి న్యాయం జరిగేది.!' - MAHAVIR CHAKRA to KALNAL SANTHOSH BABU

తెలంగాణ వాసి అయిన కర్నల్​ సంతోష్​ ​బాబు త్యాగానికి కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర ఇచ్చి గౌరవించింది. అయితే... గల్వాన్​ పోరులో సంతోష్​ ​బాబు చూపించిన వీర పటిమకు పరమవీరచక్ర ఇచ్చి ఉంటే బాగుండేదని... పూర్తి న్యాయం జరిగినట్టయ్యేదని ఆయన తండ్రి ఉపేందర్​ అభిప్రాయపడ్డారు.

KALNAL SANTHOSH BABU FATHER OPINION ON MAHAVIR CHAKRA
'పరమ వీర చక్ర ఇచ్చి ఉంటే పూర్తి న్యాయం జరిగేది.!'

By

Published : Jan 27, 2021, 8:20 PM IST

'పరమ వీర చక్ర ఇచ్చి ఉంటే పూర్తి న్యాయం జరిగేది.!'

దేశం కోసం వీరమరణం పొందిన తెలంగాణ వాసి కర్నల్ సంతోష్​​ బాబుకు మహావీర చక్ర పురస్కారం ఇవ్వడం సంతోషమే అయినా.. పరమ వీర చక్ర పురస్కారం ఇస్తే బాగుండేదని ఆయన తండ్రి బికుమల్ల ఉపేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కుమారుడి వీరమరణం పట్ల గర్విస్తున్నాని చెప్పారు. ఆయుధాలు లేకుండా శత్రు మూకలను తరిమికొట్టిన సంతోష్​​కు పరమవీర చక్ర పురస్కారం దక్కితే న్యాయంగా ఉండేదన్నారు. గల్వాన్ పోరు అనంతరం భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు.

కర్నల్​ సంతోష్​ భార్య సంతోషి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ట్రైనీ డిప్యుటీ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించారు. నిన్న జరిగిన గణతంత్ర వేడుకల్లో ట్రైనీ కలెక్టర్​ హోదాలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..

ABOUT THE AUTHOR

...view details