తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ముందడుగు పడింది. గజ్వేల్ మండలంలోని అక్కారం వద్ద ఉన్న పంప్‌హౌస్ వెట్‌రన్ విజయవంతమైంది. నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పూజలు చేసి అక్కారం పంపు ప్రారంభించారు.
తెలంగాణ: కాళేశ్వరం మరో పంప్‌హౌస్ వెట్‌రన్ సఫలం - అక్కారం పంప్‌హౌజ్ వెట్‌రన్ సఫలం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో కీలక పంప్‌హౌస్‌ను పరీక్షించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అక్కారం వద్ద ఉన్న పంప్‌హౌస్ వెట్‌రన్ విజయవంతమైంది.
తెలంగాణ:కాళేశ్వరం మరో పంప్‌హౌస్ వెట్‌రన్ సఫలం
ఈ ప్రక్రియ ద్వారా మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ జలాశయానికి గోదావరి నీటి తరలింపునకు నాందిపడింది. అక్కారం పంప్ హౌస్ నుంచి కాళేశ్వర జలాలు కాల్వల ద్వారా మర్కుక్ పంప్ హౌస్‌కు చేరాయి. సీఎం కేసీఆర్ త్వరలోనే మర్కుక్ పంప్ హౌస్ వెట్‌రన్ ప్రారంభించి కొండపోచమ్మ జలాశయంలోకి గోదావరి జలాల పంపింగ్ ప్రారంభిస్తారు.