ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పేదల నోటి కాడి కూడు లాగేస్తున్నారు...' - కళా వెంకట్రావు తాజా వార్తలు

కరోనా విపత్తు వేళలోనూ వైకాపా నేతల అక్రమాలు ఆగడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. మద్యం, ఇసుక, రేషన్ బియ్యం దోచుకుంటున్నారని ఆక్షేపించారు. వైకాపా నేతలు పలుచోట్ల భూములు కబ్జా చేస్తున్నారన్నారు. మద్యం ఎలుకలు తాగాయి, ఇసుక చేపలు తీనేశాయి అనే వింత కథలు చెప్తున్నారన్నారు. అనకాపల్లి ఎంపీ ట్రస్ట్‌కు రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడ్డారన్న కళా.. ఈ ఘటనపై మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైకాపా నేతల అక్రమాలపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

kala-venkatro-criticises-ycp
kala-venkatro-criticises-ycp

By

Published : Apr 29, 2020, 10:55 AM IST

Updated : Apr 29, 2020, 3:15 PM IST

కరోనా వల్ల ప్రపంచమంతా స్తంభించినా వైకాపా నేతల అక్రమాలు, అరాచకాలు ఆగటం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. వైకాపా నేతలు అక్రమంగా మద్యం, ఇసుక, రేషన్ బియ్యం దోచుకుంటున్నారని ఆరోపించారు. భూములు కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. వైకాపా నేతలు పేదల నోటి కాడి కూడు కూడా లాగేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి సంబంధించిన ట్రస్టుకి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ పట్టు బడితే... ఇంత వరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

కళా వెంకట్రావు లేఖ

మద్యం ఎలుకలు తాగాయా?

వైకాపా తమ తప్పుల్ని తెదేపాపైకి నెట్టడం అలవాటైపోయిందన్న కళా... ప్రజలు నమ్మకపోయే సరికి నోరు లేని మూగ జీవాలపైకి నెడుతున్నారని దుయ్యబట్టారు. ఎలుకలు మద్యం తాగాయాని అనటం వింతగా ఉందన్న ఆయన ఇసుక అక్రమంగా దోచేస్తున్నారని ఆక్షేపించారు. ఆకలేసి ఇసుకను చేపలు తినేశాయని వైకాపా నేతలు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. వైకాపా నేతల అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉంటున్నారన్నారు. మంత్రులు ప్రజాసేవ చేయటం కంటే ప్రజాధనం దోచుకోవటంలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు. తమ పదవులు కాపాడుకునేందుకే తెదేపాని, చంద్రబాబుని విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి :సీఎంకు లైవ్​లో మాట్లాడటం రాదా?: తెదేపా

Last Updated : Apr 29, 2020, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details