కరోనాపై తప్పుడు లెక్కలతో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. సమస్య తీవ్రతపై కాకి లెక్కలు చెబుతూ రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సకాలంలో వైద్యం అందక ప్రజలు చనిపోతున్నా వైద్యారోగ్యశాఖ మంత్రికి పట్టదా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం కూడా సరిగా అందడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో సకాలంలో వైద్యం అందక బాలింత ప్రాణాలు కోల్పోయిందని, నెల్లూరు జిల్లాలో సమయానికి వైద్యం అందక శివ సాగర్ అనే వ్యక్తి చనిపోయాడని చెప్పారు. వైద్యానికి పెద్ద పీట వేస్తున్నాం, వేల కోట్లు కేటాయిస్తున్నామని గంభీరమైన ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఘటనలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని బాధ్యత వహిస్తారా అంటూ నిలదీశారు.
వైద్యులకేది రక్షణ?