ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kala Venkata Rao: న్యాయస్థానాలను బ్లాక్ మెయిల్ చేసే చర్యలు తగదు: కళా

By

Published : Jun 25, 2021, 5:56 PM IST

న్యాయస్థానాలను బెదిరించే చర్యలకు జగన్ రెడ్డి పాల్పడితే..తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెదేపా నేత కళా వెెంకట్రావు(Kala Venkata Rao) హెచ్చరించారు.

Kala Venkata Rao
Kala Venkata Rao


న్యాయస్థానాల్ని బ్లాక్ మెయిల్ చేసే చర్యలు జగన్ రెడ్డికి తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు(Kala Venkata Rao) హితవు పలికారు. ఇదే విధానం కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నేరాలు, హోల్​సేల్‌ లూటీ, చట్టమంటే లెక్కలేని తనం ఇకనైనా మానుకోవాలంటూ ముఖ్యమంత్రికి ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.

''వివేకానందరెడ్డి హత్యపై కుమార్తె న్యాయ స్థానం తలుపులు తట్టడం పరిపాలనకు అడ్డుపడటమా. రాజధానిని ముక్కలు చేస్తుంటే భూ త్యాగం చేసిన రైతులు న్యాయస్థానానికి కాక ఇంకెవరికి చెప్పుకోవాలి. మద్యం, ఇసుక, సిమెంట్ ధరలు పెంచి ప్రజల్ని లూటీ చేస్తుంటే న్యాయ స్థానాలను ఆశ్రయించకూడదా. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు కోర్టుకు వెళ్లటం తప్పైతే జగన్ రెడ్డి కుటుంబం చంద్రబాబుపై అక్రమంగా 18 కేసులు పెట్టడంతోపాటు, 26 సభాసంఘాలు ఎందుకు నియమించింది. సీఎంగా చంద్రబాబు ఏనాడూ తనపై ఉన్న కేసుల ఉపసంహరణ కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు" అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details