రాష్ట్రంలో వైకాపా 9 నెలల పాలనలో కూల్చివేతలు, రద్దులే మిగిలాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదన్న ఆయన.. రిలయన్స్, ఆదానీ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఇలా జరుగుతోందని అన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ హయాం నాటి కొందరు అధికారులపై ఇప్పటికీ కేసులున్నాయని ఆయన గుర్తు చేశారు.
'వైకాపా 9 నెలల పాలనలో కూల్చివేతలు, రద్దులే మిగిలాయి' - tdp leader kala venkatarao comments on ycp ruling
వైకాపా పాలనపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శలు చేశారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత విధిస్తున్నారన్న ఆయన.. ప్రభుత్వ విధానాల వల్ల ప్రముఖ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు.
'వైకాపా 9 నెలల పాలనలో కూల్చివేతలు, రద్దులే మిగిలాయి'