సీఎం జగన్ పై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. గతంలో ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మరిచారని ఆక్షేపించారు. వైకాపా తరుఫున గెలిచిన 30 మంది ఎంపీల వల్ల రాష్ట్రానికి ఉపయోగమేంటని..? ఆయన ప్రశ్నించారు. హోదా కోసం కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు.
హోదా కోసం వైకాపా ఎందుకు పోరాటం చేయట్లేదు..?: కళా వెంకట్రావు - తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు
వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా మరిచిపోయిందని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఈ అంశంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదని అన్నారు.
kala venkata rao