రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ మాటలు.... ఆరు నెలల వైకాపా పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన..ప్రాంతీయ విభేదాలు, కులమతాల మధ్య చిచ్చు పెట్టడానికే జగన్ రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రపంచ ఖ్యాతి ఉన్న రాజధాని అన్న ఆయన... ఆర్థిక రాజధాని కావలసిన విశాఖను అణగదొక్కడానికే ప్రాంతీయ విబేధాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో మంత్రులు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ది తుగ్లక్ పాలన అని విమర్శించారు. ఆరు మాసాల్లో 10 లక్షల మంది కార్మికుల పొట్టకొట్టారని దుయ్యబట్టారు.
'వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే... 3 రాజధానులు' - రాజధాని అమరావతి
ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. రాజధాని విషయంలో మంత్రులు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కళా వెంకట్రావు