చంద్రబాబుపై విశ్వాసం లేకనే... తెలుగుదేశం పార్టీని వీడుతున్నానని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో... ఆయన వైకాపాలో చేరారు. సీఎం జగన్ వైకాపా కండువా కప్పి బాబూరావును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నందమూరి బాలకృష్ణ తనకు మంచి మిత్రుడని... అందుకే ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీలో కొనసాగానని బాబూరావు పేర్కొన్నారు.
వైకాపాలో చేరిన తెదేపా నేత కదిరి బాబూరావు - మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వార్తలు
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైకాపా గూటికి చేరారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన తెదేపా అధినేత చంద్రబాబు తనను మోసం చేశారని ఆరోపించారు.
kadiri babu rao joined ysrcp