Viveka Murder Case News: మాజీమంత్రి వివేకా హత్య కేసులో.. వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని.. 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Viveka Murder Case Updates: వివేకా హత్య కేసులో.. దస్తగిరి అప్రూవర్ పిటిషన్‌కు కడప సబ్ కోర్టు అనుమతి
20:44 November 26
Kadapa Sub-Court On Dastagiri Approver Petition 164 సెక్షన్ కింద మరోసారి దస్తగిరి వాంగ్మూలం నమోదు చేసే అవకాశం
అయినప్పటికీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. దస్తగిరిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు మరోసారి దస్తగిరి నుంచి 164 సెక్షన్ కింద మెజిస్ట్రేట్ ముందు(Kadapa Sub-Court approves Dastagiri Approver Petition in Viveka murder case) వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉంది. కాగా సీబీఐ కస్టడీలో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని డిసెంబరు 2 వరకు సీబీఐ విచారించనుంది. అదే విధంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈనెల 29కి వాయిదా పడింది.
ఇదీ చదవండి
పరాయి మహిళ ఒడిలో ఎస్సై సేద తీరుతున్నాడు.. ఆమె భర్త తలుపు తీశాడు!!