CJI NV RAMANA: హైదరాబాద్ బీకేగూడ పార్కు వద్ద శ్రీనివాస సమాజ సేవా ఛారిటబుల్ ట్రస్టు గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న మధ్యాహ్న మిత భోజనం పథకం వేసవిలో బాటసారులకు, అన్నార్తులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. తన తండ్రి గణపతిరావు జ్ఞాపకార్థం శుక్రవారం ఆయన ఈ మిత భోజనం కార్యక్రమానికి దాతగా వ్యవహరించారు. పలువురు వృద్ధులకు స్వయంగా భోజనాన్ని అందించారు. ఇలాంటి సమాజ సేవ ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ట్రస్టు నిర్వాహకులు, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి డి.పార్థసారథి, సభ్యులను అభినందించారు.
CJI NV RAMANA: సమాజ సేవ సంతృప్తినిస్తుంది- సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ - ap latest news
CJI NV RAMANA: గత రెండు నెలలుగా శ్రీనివాస సమాజ సేవా ఛారిటబుల్ నిర్వహిస్తున్న మధ్యాహ్న మిత భోజనం పథకం అన్నార్తులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థం శుక్రవారం ఆయన ఈ మిత భోజనం కార్యక్రమానికి దాతగా వ్యవహరించారు.
సమాజ సేవ సంతృప్తినిస్తుంది