ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NTR Fan Suicide Attempt: అడ్డంగా మరో ఫ్లెక్సీ పెట్టారని...పెట్రోల్​ పొసుకుని..! - కోదాడలో ఎన్టీఆర్ ఫ్యాన్‌ హల్‌చల్‌

NTR Fan Suicide Attempt : lతెలంగాణ రాష్ట్రంలో ఏ థియేటర్‌ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హడావుడే కనిపిస్తోంది. సినిమా హాళ్ల ప్రాంగణాల వద్ద ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ అభిమానులు ఒకరికొకరు పోటాపోటీగా కటౌట్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికించేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు గురించి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మధ్యే గొడవ చోటు చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది.

NTR Fan Suicide Attempt
ఎన్టీఆర్​ అభిమాని ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 22, 2022, 12:23 PM IST

ఎన్టీఆర్​ అభిమాని ఆత్మహత్యాయత్నం

NTR Fan Suicide Attempt : తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో థియేటర్లన్నీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పోస్టర్లతో కళకళళాడుతున్నాయి. ఓ సినిమా హాల్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి అడ్డంగా.. మరో ఫ్లెక్సీ పెట్టారని ఆరోపించాడు. ఈ విషయంపై తారక్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన ఫ్లెక్సీకి అలా ఎలా అడ్డుపెడతారని నాగులు అనే అభిమాని గొడవకు దిగాడు.

NTR Fan Suicide Attempt in Kodada : అంతటితో ఆగకుండా తన ఫ్లెక్సీ అడ్డుగా ఉన్న కటౌట్లు తొలగించకపోతే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నాగులును అడ్డుకున్నారు. అతనికి సర్దిజెప్పి ఇంటికి పంపించారు.

"1989 నుంచి నేను ఎన్టీఆర్ ఫ్యాన్‌ను. నందమూరి ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం. పది రోజుల ముందే నేను ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు నా ఫ్లెక్సీకి ముందు కటౌట్లు పెడుతున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజుకు 3వేల మందికి అన్నదానం చేశాను. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల రోజు అన్నదానం చేస్తాను. ఇప్పుడు ఆ కటౌట్లు తొలగించకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను" - నాగులు, ఎన్టీఆర్ అభిమాని

ABOUT THE AUTHOR

...view details