ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యుల సమ్మె - junior doctors protest news

తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు నిరసన చేపట్టారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

strick
సమ్మె

By

Published : May 26, 2021, 2:29 PM IST

తెలంగాణ వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్​ ఎంజీఎం సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా విధులను జూడాలు బహిష్కరించారు. పెంచిన స్టైపండ్, కొవిడ్ ప్రోత్సాహకాలు అమలు చేయాలని జూడాలు డిమాండ్​ చేశారు. కొవిడ్‌ బారిన పడిన వైద్యసిబ్బందికి నిమ్స్‌లో చికిత్స అందించాలని కోరారు.

కొవిడ్‌తో మృతి చెందిన వైద్యులకు రూ.50 లక్షలు, కొవిడ్‌తో చనిపోయిన వైద్య సిబ్బందికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేపటినుంచి రెసిడెంట్​ వైద్యులు కూడా విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. తమ డిమాండ్​లపై ప్రభుత్వం స్పందించకుంటే 28 నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. తమ సమస్యలు తీరే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details