కరోనా కారణంగా జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించినట్లు జూన్ ఒకటి నుంచి కాకుండా.. పునఃప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.
- సాంకేతిక విద్య అధ్యాపకులకు నైపుణ్య శిక్షణ
ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ అధ్యాపకులకు వర్చువల్ ఆన్‌లైన్ శిక్షణ రెండోవిడత జూన్1 నుంచి 13వరకు నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో ఆర్జా శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12గంటలు, సాయంత్రం 2-4గంటల వరకు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5, 145మంది నమోదు చేసుకోగా మొదటి విడతలో 1200మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
కళాశాలల అనుమతుల దరఖాస్తు గడువు పొడిగింపు
కొత్త జూనియర్ కళాశాలలకు అనుమతులు, పాత వాటికి అనుబంధ గుర్తింపు, అదనపు సెక్షన్ల గడువు పెంపునకు దరఖాస్తు గడువు జూన్ 30 వరకు పొడిగించినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. అనుబంధ గుర్తింపు, సెక్షన్లకు అపరాధ రుసుముతో ఆగస్టు 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.