Gachibowli Road Accident Today: హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులతో పాటు మరొకరు మృతి చెందారు. మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Gachibowli Car Accident: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం - Gachibowli Road Accident Today
07:18 December 18
Gachibowli Road Accident News: మృతుల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు
Junior Artists Died in Gachibowli Accident news : తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతులు జూనియర్ ఆర్టిస్టులు ఎన్.మానస(23), ఎం. మానస(21), బ్యాంక్ ఉద్యోగి అబ్దుల్ రహీమ్ (25)గా పోలీసులు గుర్తించారు. వీరంతా అమీర్‌పేట్‌లోని ఓ వసతిగృహంలో ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడకు చెందిన రహీమ్.. మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఎం.మానస స్వస్థలం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిగా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Gachibowli Road Accident news: కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురికి ఎలా పరిచయం ఉందన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి లింగంపల్లి ఎందుకు వెళ్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు.
ఇదీచదవండి..
married woman dead: పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి