Jagan Bail cancel petition: జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యంపై తీర్పు వాయిదా - cm jagan case issue latest news
13:48 August 25
సెప్టెంబర్ 15న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. అన్నివైపుల వాదనలు పూర్తికావడంతో జులై 30న విచారణ ముగించింది. ఆ రోజున తీర్పును రిజర్వ్ చేసిన సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు వెలువరిస్తామని తెలిపింది.
ఈ తీర్పు ఎలా ఉంటుందోనని అప్పటినుంచి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దునూ కోరుతూ రఘురామరాజు వేసిన పిటిషన్‌పై ఇవాళే వాదనలు ముగియడంతో.. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా సెప్టెంబర్ 15వ తేదీన ఒకేసారి తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు పేర్కొంది.
ఇదీ చదవండి: ACCIDENT: ప్రకాశం జిల్లాలో ప్రమాదం..ఆటో నుంచి పడి నలుగురు మృతి