Jubileehills Gang Rape Case: జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం కేసులో కీలక ఘట్టం పూర్తయింది. నిందితులను గుర్తించే ప్రక్రియను పోలీసులు ఇవాళ పూర్తి చేశారు. జడ్జి సమక్షంలో అత్యాచారం చేసిన వారిని గుర్తించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను గుర్తించిన బాలిక పోలీసులకు వివరాలు వెల్లడించింది.
Jubileehills Gang Rape Case : నిందితుల డీఎన్ఏ సేకరణకు కోర్టు అనుమతి
Jubileehills Gang Rape Case: జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. నిందితులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేశారు. జడ్జి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియను చేపట్టిన పోలీసులు.. బాధిత బాలిక పోలీసులకు వివరాలు తెలిపింది.
బాధితురాలు తెలిపిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. అదేవిధంగా చంచల్‌గూడ జైలులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ గుర్తింపు ప్రక్రియను కూడా పోలీసులు పూర్తి చేశారు. సైదాబాద్ జువైనల్ హోమ్‌లో ఐదుగురు బాలురను కూడా బాలిక గుర్తించింది. మే 28వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సాదుద్దీన్(18) ప్రధాన నిందితుడు (ఏ-1) కాగా.. మిగిలిన అయిదుగురు మైనర్లు. ప్రస్తుతం సాదుద్దీన్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మిగిలిన ఐదుగురు మైనర్లు సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌లో ఉన్నారు.
ఇవీ చదవండి: