Case on pushpa pre release event: "పుష్ప" చిత్రం ప్రీ-రిలీజ్ సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీసు మైదానంలో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకకు అనుమతికి మించి అభిమానులను సమీకరించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు.. ఈ కార్యక్రమంలో కొవిడ్ నిబంధనలు పాటించలేదని.. రక్షణ చర్యలు చేపట్టలేదంటూ ఈవెంట్ నిర్వాహకులైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి కిశోర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.