ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజకీయ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించారంటే? - jr ntr speaks on political entry

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ సినీనటుడు జూనియర్​ ఎన్టీఆర్ హైదరాబాద్​లో​ స్పందించారు. ఓ టీవీ ఛానల్​లో ప్రసారం కానున్న ప్రత్యేక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తారక్​... ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ ఆరంగేట్రంపై స్పష్టతనిచ్చారు.

junior ntr about political entry
రాజకీయ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించారంటే

By

Published : Mar 13, 2021, 5:57 PM IST

రాజకీయం అరంగేట్రంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఓ టీవీ ఛానల్​లో ప్రసారం కానున్న ప్రత్యేక షోకు వ్యాఖ్యాతగా తారక్​ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా పాత్రికేయులు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారంటూ తారక్​ను ప్రశ్నించారు. స్పందించిన తారక్​.. 'ఈ ప్రశ్నను మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. '‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు’'. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం' అని స్పష్టం చేశారు.

కథానాయకుడిగా కంటే బుల్లితెరపై కనిపించడం వ్యక్తిగతంగా తనకెంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు జూనియర్​ ఎన్టీఆర్​. స్టార్​గా నలుగురితో కలిసి స్వేచ్ఛగా మాట్లాడే పరిమితి కోల్పోయిన తమకు.. బుల్లితెరపై కనిపించడం ఎంతో ఊరటనిస్తుందన్నారు. అలాగే తన అభిమానులెప్పుడూ కాలర్ ఎగరేసేలా ఉండటానికి తాను కష్టపడతానన్నారు. అభిమానులు ఏ పేరుతో పిలిచినా పలుకుతానని చమత్కరించారు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​.

ఇవీచూడండి:

ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా: తారక్

ABOUT THE AUTHOR

...view details