JP NADDA:ప్రధాని మోదీ పరిపాలనా దక్షత వల్ల దేశంలో పేదరికం 22% నుంచి 10%కు తగ్గిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం రాత్రి జరిగిన పార్టీ మేధావుల సభనుద్దేశించి మాట్లాడుతూ ఎగుమతులు రికార్డుస్థాయిలో పెరిగాయన్నారు. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయని తెలిపారు. 50 కోట్ల మంది భారతీయులకు రూ.10,500 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యబీమా లభించిందన్నారు. ఉక్రెయిన్ నుంచి 23వేల మందిని భద్రంగా భారతదేశానికి తెచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సహ బాధ్యులు సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఇతర నేతలు పాల్గొన్నారు. సమావేశాన్ని మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ ప్రారంభించారు. చివర్లో పద్మావతి అనే మోదీ అభిమాని బియ్యం గింజలతో రూపొందించిన ప్రధాని చిత్తరువును నడ్డాకు అందచేశారు.
కేంద్ర పథకాలపైనే సాగిన ప్రసంగం