ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు దేవీప్రియ పరమపదించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ కవి దేవీప్రియ కన్నుమూత... తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం - cm kcr tribute to journalist devipriya death
ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు దేవీప్రియ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న దేవీప్రియ... ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ కవి దేవీప్రియ కన్నుమూత
కవి, రచయిత, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యానికి దేవీప్రియ కృషి చేశారని సీఎం తెలిపారు. ఆయన సాహిత్య ప్రతిభకు 'గాలి రంగు' రచన మచ్చుతునక అని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.