రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమైంది. సచివాలయంలోని 5వ బ్లాక్‌లో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. పీఆర్సీ, డీఏ బకాయిలు సహా ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లపై సమావేశంలో చర్చించనున్నారు.
JOINT STAFF COUNCIL MEETING: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం - ap latest news
సచివాలయంలోని 5వ బ్లాక్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి.

నేడు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
సీఎస్ సమీర్‌శర్మ నేతృత్వంలో ప్రభుత్వం తరఫున అన్ని శాఖల కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయడంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వం స్పందనను బట్టి.. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంఘాలు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపాయి.
ఇదీ చూడండి:LIVE VIDEO : కాసేపైతే జలసమాధే.. వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు!
Last Updated : Nov 12, 2021, 3:21 PM IST