మహాత్ముడు కలలుకన్న గ్రామస్వరాజ్యాన్ని నెరవేర్చే దిశలో గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభిస్తే... తెదేపా అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. గ్రామ స్వరాజ్యంపై చంద్రబాబు తన వైఖరి చెప్పాలన్న జోగి రమేష్... రాత్రింబవళ్లు కష్టపడి చదివి, ఉద్యోగాలు సాధించిన యువతపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక లక్ష 34 వేల ఉద్యోగాలను కల్పిస్తే... ఉద్యోగాలు సాధించిన వారిని కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. గ్రామాల్లో సమస్యలను 72గంటల్లో పరిష్కరించేందుకే ఈ వ్యవస్థను తీసుకొచ్చామని ఆయన స్పష్టత ఇచ్చారు.
'కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే...యువతను కించపరుస్తారా' - గ్రామస్వరాజ్యాన్ని సాకారం
గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తోన్న గ్రామ సచివాలయ వ్యవస్థపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని వైకాపా నేత జోగి రమేష్ అన్నారు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన యువతను కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రామస్వరాజ్యంపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ జోగి రమేష్ చేశారు.
కష్టబడి ఉద్యోగాలు సాధిస్తే... కించపరుస్తారా : జోగి రమేష్