కరోనాతో గడగడలాడిన రాష్ట్ర సచివాలయ సిబ్బందికి ఉద్యోగ సంఘాలు ఆనందయ్య మందును పంపిణీ చేశాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం తరపున ఈ మందును తెప్పించి సిబ్బందికి అందిస్తున్నట్టు ఏపీఎస్ఏ అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచకుని కరోనా నియంత్రణలో భాగంగా ఆనందయ్య మందును తెప్పించి పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆనందయ్య మందును తీసుకునేందుకు ఉద్యోగులు పోటీ పడ్డారు.
Anandaiah Medicine: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఆనందయ్య మందు - ఏపీ సచివాలయం తాజా సమాచారం
రాష్ట్ర సచివాలయ సిబ్బందికి ఆనందయ్య మందును ఉద్యోగ సంఘాలు పంపిణీ చేశాయి. ఉచితంగా ఈ మందును ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నట్లు ఏపీఎస్ఏ అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు.
ఏపీ సచివాలయం
ఇదీ చదవండీ.. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను సుమోటోగా తీసుకోవడం దేశంలోనే ప్రథమం: ఏజీ