ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్ పరీక్ష - తెలంగాణ వార్తలు

తెలంగాణలో జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్​లైన్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 నగరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.

jee mains second phase in telangana
తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్ పరీక్ష

By

Published : Mar 16, 2021, 1:06 PM IST

తెలంగాణ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్‌లైన్‌ పరీక్ష జరుగుతోంది. 11 నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. నిమిషం నిబంధన ఉండడంతో... ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. రోజుకు రెండుసార్లు చొప్పున మూడు రోజులు పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి అవుతుంది... మరొకటి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. వరంగల్​ నగరంలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1036 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు లక్షా 10 వేల మంది ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్క్ ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి:పరిషత్‌ ఎన్నికలపై... ఎస్‌ఈసీ ఆదేశాలు రద్దు చేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details