జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్స్) ఇక మీదట తెలుగుభాషలో కూడా జరగనుంది. ఈ పరీక్షను మొత్తం 11 భాషల్లో నిర్వహించడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సిద్ధమవుతోంది. అస్సామీ, బెంగాలీ, ఆంగ్లం, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్ధూ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
2021 నుంచి అమలు
ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో మెయిన్స్ నిర్వహిస్తున్నారు. గుజరాతీకి ప్రాాధాన్యం ఇచ్చినట్లుగా ఇతర భాషలకు ఇవ్వాలని ఇటీవల పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్రాన్ని అభ్యర్థించారు. దీనిని పరిశీలించిన కేంద్రం.. 11 భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. 2020కి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినందున 2021 నుంచి ప్రాంతీయ భాషల పరీక్షా పత్రం రూపొందించనున్నారు.