JEE MAINS: జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేడు(23-06) ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఉంటాయి.
JEE MAINS: నేటి నుంచి జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు.. - జేఈఈ మెయిన్స్ తొలి సెషన్
JEE MAINS: మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి.
JEE MAINS
దేశంలోని 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 29 జీఎఫ్టీఐల్లోని సుమారు 40వేల ఇంజినీరింగ్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా భర్తీ చేస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లోని దాదాపు 13వేల ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులను జేఈఈ మెయిన్ ద్వారా ఖరారు చేస్తారు. రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి..
ఇదీ చూడండి: