ప్రపంచంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం భారత్ అని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హెచ్సీయూ, ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'అక్షరాస్యతలో వెనకబడ్డ పేదదేశం మనది' - latest news on jaya prakash narayana
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించే దిశగా ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ పనిచేస్తుందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో రాజకీయాల్లో ధన ప్రవాహం అనే అంశంపై జరుగుతున్న సదస్సులో ఆయన ప్రసంగించారు.
అక్షరాస్యతలో వెనుకబడ్డ పేదదేశం మనదని పేర్కొన్నారు. జనాభాలో, విస్తీర్ణంలో గత రెండువేల సంవత్సరాలుగా ప్రజాస్వామ్య అనుభవం లేదని పేర్కొన్నారు. ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ ద్వారా ప్రతి సంవత్సరం జాతీయ సదస్సులు నిర్వహించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. రాజకీయాల్లో ధన ప్రవాహంపై జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఇవీచూడండి:ఓట్ల కొనుగోలు, డబ్బు పంపకం.. పరిపాటిగా మారింది: ఉపరాష్ట్రపతి