రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నా... వైకాపా నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, అంబటి రాంబాబు నోరు మెదపలేదని మాజీ మంత్రి కే.ఎస్. జవహర్ మండిపడ్డారు. శిరోముండనం, విక్రమ్ హత్యలపై వారు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాజధాని నిర్మాణం ఎస్సీ నియోజకవర్గంలోనే నిర్మిస్తున్నారన్న విషయం కళ్లు తెరచి చూస్తే కనబడుతుందని అన్నారు. రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిఒక్కరూ చరిత్రలో హీనులుగా నిలిచిపోతారన్నారు. ఐదు కోట్ల మందికి ప్రజల కాంక్ష అయిన రాజధానిని ముక్కలు చేసి వైకాపా నేతలు రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతి రైతలు కన్నీళ్ల తుపానులో వైకాపా నేతలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
'శిరోముండనం, విక్రమ్ హత్య కేసులపై ఎందుకు నోరు మెదపరు' - jawahar fires on ycp leaders latest news
వైకాపా నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, అంబటి రాంబాబులపై మాజీ మంత్రి, తెదేపా నేత కేఎస్ జవహర్ మండిపడ్డారు. శిరోముండనం, విక్రమ్ హత్యలపై వారు ఎందుకు స్పందించలేదని అడిగారు. ఇందుకు వైకాపా నేతలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన తెలిపారు.
మాజీ మంత్రి కే.ఎస్. జవహర్