jawad cyclone: జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతోంది. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో జవాద్ తుపాను పయనిస్తోంది. విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గోపాల్‌పుర్‌కు 320 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమవ్వగా.. పారాదీప్‌కు 470 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. సాయంత్రానికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
JAWAD CYCLONE: దిశ మార్చుకున్న జవాద్.. ఒడిశా వైపు పయనం - jawad
జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతోంది. సాయంత్రానికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
JAWAD CYCLONE
రేపు మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఒడిశాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: