పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని డైకీ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసిన డైకీ సంస్థ ప్రతినిధులు ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. డైకీ పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాలను స్థానిక యువతలో పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. జపాన్‌లోని ఓసాకా ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక డైకీ అల్యూమినియం సంస్థ 1922 నుంచి అల్యూమినియంను ఉత్పత్తి చేస్తోంది. హోండా, నిస్సాన్, టయోటా, సుజుకి లాంటి వాహన తయారీ దిగ్గజ సంస్థలు డైకీ నుంచే అల్యూమినియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి.
ఉత్పత్తికి సిద్ధమవుతోన్న డైకీ అల్యూమినియం పరిశ్రమ - japan Representatives meet minister goutham reddy news
జపాన్‌కు చెందిన ప్రముఖ అల్యూమినియం పరిశ్రమ డైకీ ఏపీలో ఉత్పత్తికి సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో నిర్మితమైన డైకీ అల్యూమినియం ఏడాదిలోగానే ఉత్పత్తి చేసేందుకు సిద్ధమని ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి వెల్లడించారు.
japan daiki aluminium industry started product in sricity