హైకోర్టు తీర్పుననుసరించి ఈ క్షణం నుంచే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషన్‌గా కొనసాగుతారని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అన్నారు. ఎన్నికల అధికారిగా కనగరాజ్ కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ రద్దు కావడంతో రమేశ్ కుమార్ కమిషనర్‌గా ఉన్నట్టేనని వ్యాఖ్యానించారు.
ఈ క్షణం నుంచి నిమ్మగడ్డే ఎస్ఈసీ: జంధ్యాల - ఏపీ ఎస్ఈసీ వార్తలు
ఎస్ఈసీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చెల్లవని హైకోర్టు తీర్పు వెలువరించడంతో..ఈ క్షణం నుంచే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ అన్నారు.
jandhyala ravi shankar