ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అరెస్టైన రైతుల కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష... జనసేన మద్దతు

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో రైతుల అరెస్ట్​లను నిరసిస్తూ..వారి కుటుంబ సభ్యులు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. వారి దీక్షకు జనసేన, అమరావతి మహిళా ఐకాస మద్దతు తెలిపింది. నిరసన శిబిరం వద్దకు వెళ్లిన జనసేన నేతలు రైతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Janasena
Janasena

By

Published : Nov 2, 2020, 4:29 PM IST

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో అరెస్టైన రైతుల కుటుంబ సభ్యులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి జనసేన, అమరావతి మహిళా ఐకాస నేతలు సంఘీభావం ప్రకటించారు. రైతుల కుటుంబ సభ్యులు చేసే ఎలాంటి పోరాటానికైనా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేసే పోరాటానికి జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే అమరావతిలో పర్యటిస్తారని శ్రీనివాస్ అన్నారు. అన్నం పెట్టే రైతులకు బేడీలు వేసిన తొలి ప్రభుత్వంగా వైకాపా చరిత్రలో నిలిచిపోతుందని జనసేన నేత మహేశ్ చెప్పారు. మహిళలతో ఇంత కర్కశంగా వ్యవహరించిన ప్రభుత్వం ఏదీ లేదని అమరావతి మహిళా ఐకాస నేత అన్నాబత్తుని జయలక్ష్మి అన్నారు.

ఇదీ చదవండి :ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీల కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details