ఇసుక కొరతపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురువారం చేపట్టబోతున్న దీక్షకు జనసేన నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్‌తో పాటు జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ హాజరుకానున్నారు. ఇరువురూ చంద్రబాబు దీక్షకు హాజరై సంఘీభావం తెలపనున్నారు. ఈ ఉదయం పవన్ కల్యాణ్‌ను తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు ఆయన నివాసంలో కలసి దీక్షకు మద్దతు కోరిన విషయం తెలిసిందే.
ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షకు జనసేన మద్దతు - janasena support to TDP news
ఇసుక కొరతపై తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టనున్న దీక్షకు మద్దతు ఇస్తున్నట్టు జనసేన ప్రకటించింది. పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని ఆ పార్టీ అధినేత పవన్ నిర్ణయించారు.
janasena support to tdp sand protest at vijayawada