ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Janasena: సీఎంకు మహిళల రక్షణపై బాధ్యత లేదా?: పోతిన మహేష్ - జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వార్తలు

రాష్ట్రంలో దిశా చట్టం కేవలం ప్రచార్భాటాలేకే తప్ప...మహిళలను కాపాడటానికి కాదని జనసేన(Janasena) అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ధ్వజమెత్తారు.

Pothina Mahesh
పోతిన మహేష్

By

Published : Jun 21, 2021, 4:14 PM IST

మహిళల రక్షణపై ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని జనసేన(Janasena) అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ నిలదీశారు. సీఎం తాడేపల్లి ప్యాలెస్​కు సమీపంలో యువతిపై అత్యాచారం జరిగినా..వైకాపా నేతలెవరూ స్పందించలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి, మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ తక్షణం బాధితులను పరామర్శించి... అండగా నిలిచి సహాయం చేయాలని పోతిన మహేష్‌ కోరారు.

మహిళలను కాపాడలేని దిశా చట్టం ప్రచారం కోసం చేసిందేనని ధ్వజమెత్తారు. డీజీపీ చెబుతున్న బెస్ట్ పోలీసింగ్ అవార్డులు షో కేసులో పెట్టుకోవడానికే కానీ... శాంతిభద్రతలను కాపాడటానికి కాదని ఎద్దేవాచేశారు. కడప, చిత్తూరు జిల్లాల్లో యువతుల గొంతు కోసి, కాల్పులు జరిపినా... ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. విజయవాడలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్​ల ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details