వైకాపా ప్రభుత్వం బీసీలను బిచ్చగాళ్లుగా చేయాలనుకుంటోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదించటం ద్వారా 20 వేల రాజ్యాంగబద్ధమైన పదవులను బీసీలకు దూరం చేసిందని దుయ్యబట్టారు. ఇవాళ 720 మంది బీసీలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టి బీసీల కన్నీళ్లు తుడిచేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ అన్యాయంపై బీసీలు ఉద్యమించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలను తమ వెన్నెముకగా చెప్పుకుంటున్న వైకాపా, తెదేపాలు... ఆ వర్గాలను మోసం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు.
నామినేటెడ్ పదవుల పేరుతో బీసీలను మోసం చేశారు: జనసేన - జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ వార్తలు
వైకాపా ప్రభుత్వంపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కుదించి... ఇవాళ నామినేటెడ్ పదవుల పేరుతో బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
![నామినేటెడ్ పదవుల పేరుతో బీసీలను మోసం చేశారు: జనసేన janasena](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9248043-552-9248043-1603199812129.jpg)
janasena