ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనసేన ఆవిర్భావ సభ.. రాబోయే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడమే లక్ష్యం

JanaSena Party Formation Day: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో నేడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు పూర్తి చేశారు. సభలో పాల్గొనేందుకు ఇప్పటికే మంగళగిరి చేరుకున్న పవన్‌కల్యాణ్‌..నేడు జనసైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Janasena Emergence Sabha
ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ

By

Published : Mar 13, 2022, 10:40 PM IST

Updated : Mar 14, 2022, 9:25 AM IST

నేడు జనసేన ఆవిర్భావ సభ

JSP Formation day meeting: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. పార్టీ ఏర్పడి 8 ఏళ్లు పూర్తై తొమ్మిదో ఏట అడుగుపెడుతున్న తరుణంలో గుంటూరు జిల్లా ఇప్పటంలో అవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో నిర్మితమైన సభా ప్రాంగణానికి.. నిజాయతీ, విలువలకు నిలువుటద్దమైన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. భారీగా తరలివచ్చే శ్రేణులు సభా కార్యక్రమాలను తిలకించేందుకు వీలుగా ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికలే లక్ష్యంగా శ్రేణుల్లో సమరోత్సాహం నింపేలా పవన్ ఈ వేదికపై నుంచి భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తారని నేతలు తెలిపారు.

గతంలో జరిగిన సభల కంటే ఈసారి ఆవిర్భావ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని నేతలు భావిస్తున్నారు. విశాఖ సిటీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ మినహా అన్ని జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూరైంది. వీటి ఏర్పాటుతో పార్టీలో జోష్ పెరిగిందని... ఇప్పటం ఆవిర్భావ సభలో ఆ ప్రభావం కనిపిస్తుందని నేతలు చెబుతున్నారు. తమ పార్టీకి జనసమీకరణ చేసే అవసరం లేదని.. పవన్ పిలిస్తే జనం ప్రభంజనంలా తరలివస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సభలో పాల్గొనేందుకు రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పవన్‌కు ...నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో పవన్ మంగళగిరికి వెళ్లారు.

అందుకే పార్టీలో పెరిగిన జోష్..
గతంలో జరిగిన సభల కంటే ఈసారి ఆవిర్భావ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి మంచి స్పందన రానుందని భావిస్తున్నారు. విశాఖ సిటీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ మినహా అన్ని జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. అందుకే పార్టీలో జోష్ పెరిగిందని.. ఇప్పటం ఆవిర్భావ సభలో కమిటీల ఏర్పాటు ప్రభావం కన్పించనుందని ఆ పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వ నిర్ణయాలను, పార్టీపరంగా అనుసరించే విధానాలను పవన్ కల్యాణ్ వివరించే అవకాశముందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నందున వీరందరినీ పార్టీ అభివృద్ధికి కృషి చేసేలా పవన్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తమ పార్టీకి జనసమీకరణ చేసే అవసరం లేదని.. పవన్ ఓ పిలుపిస్తే చాలని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లక్షలాదిమంది జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు సభకు రానున్న తరుణంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

సామాన్యుల ఆత్మగౌరవానికి సంకేతమే ఈ సభ..
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అధికార అహంకారంతో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. జనసేన ఆవిర్భావ సభా వేదికను పరిశీలించిన ఆయన.. వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమే జనసేన ఆవిర్భావ సభ అన్నారు.

ఇదీ చదవండి:

ఆ పార్టీలు కులానికి, కుటుంబానికే పరిమితమయ్యాయి: భాజపా నేత లక్ష్మణ్

Last Updated : Mar 14, 2022, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details