ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మన ఉత్పత్తి.. మన ఉపాధి.. మన అభివృద్ధి.. ఆత్మనిర్భర్​ భారత్​' - janasena president pawan on atma nirbara bharath news

ఆత్మనిర్భర్​ భారత్​ అమలుకు అందరూ కృషి చేయాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పిలుపునిచ్చారు. ఈ వినాయకచవితికి ఎక్కడ ఏది కొన్నా.. అది ఇక్కడ తయారైందో లేదో చూసుకోవాలని సూచించారు. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని.. కేవలం దేశ అభివృద్ధికి సంబంధించిందని జనసేనాని స్పష్టం చేశారు.

'మన ఉత్పత్తి.. మన ఉపాధి.. మన అభివృద్ధి.. ఆత్మనిర్భర్​ భారత్​'
'మన ఉత్పత్తి.. మన ఉపాధి.. మన అభివృద్ధి.. ఆత్మనిర్భర్​ భారత్​'

By

Published : Aug 20, 2020, 9:51 PM IST

ఆత్మ నిర్భర్ భారత్ అమల్లో భాగంగా అందరూ స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ పిలుపునిచ్చారు. వినాయకచవితి నుంచే ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ పండుగకు ఏం కొన్నా.. అది ఇక్కడ తయారైందో లేదో చూడాలని సూచించారు.

ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని.. కేవలం మన దేశ అభివృద్ధికి సంబంధించినదని పవన్​ స్పష్టం చేశారు. దేశీయ ఉత్పత్తులకు గిరాకీ కల్పించేందుకు అందరూ తప్పనిసరిగా దీన్ని పాటించాలని జనసేనాని కోరారు. మన ఉత్పత్తి.. మన ఉపాధి.. మన అభివృద్ధి.. ఇదే ఆత్మ నిర్భర భారత్ అంటూ చెప్పుకొచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details