ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pawan Kalyan: 'తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాం' - పవన్ కల్యాణ్ నల్గొండ టూర్ న్యూస్

Pawan Kalyan Nalgonda Tour: జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో తెలంగాణలోని చౌటుప్పల్ కిటకిటలాడుతోంది. ఉమ్మడి నల్గొండకు బయలుదేరిన పవన్.. చౌటుప్పల్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

By

Published : May 20, 2022, 4:25 PM IST

'తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తాం'

Pawan Kalyan Nalgonda Tour : తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఇటీవల మృతిచెందిన జనసేన కార్యకర్తలు సైదులు, శ్రీనివాసరావు కుటుంబాలను పరామర్శించేందుకు... ఆయన నల్గొండ జిల్లాకు వెళ్లారు. ముందుగా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సైదులు కుటుంబాన్ని పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సేనాని... సైదులు భార్యకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటీవలే సైదులు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

చౌటుప్పల్ నుంచి లక్కారం వరకు పవన్ కల్యాణ్ ర్యాలీగా వెళ్లారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పవన్‌ కల్యాణ్‌ పర్యటన దృష్ట్యా... జనసేనానికి పట్టణంలో జనసేన కార్యకర్తలు... పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామని ప్రకటించారు. తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 5 వేలకుపైగా ఓట్లున్నాయని అన్నారు.. తెలంగాణలోనూ రాజకీయాలను జనసేన శాసిస్తుందని చెప్పారు. ఇక్కడ కూడా తమ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని వెల్లడించారు. ఏపీలో ఎన్నికల పొత్తుపై సమాధానం దాటవేసిన పవన్‌ కల్యాణ్.. శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించడానికి కోదాడకు బయలుదేరారు.

'జనసేన కార్యకర్తలకు వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన సైదులు, శ్రీనివాస్ కుటుంబాలకు జనసేన ఎప్పుడు అండగా నిలుస్తుంది. నాకు జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే అండనిచ్చింది మాత్రం తెలంగాణ అభిమానులే. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. నేను తెలంగాణలో సామాజిక మార్పు కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోరుకుంటున్నా. ఆశయం కోసం నిలబడేవాడికి ఓటమి ఉండదు.' - పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details