విజయవాడ కనకదుర్గమ్మవారి మాజీ ఈవో సురేష్‌బాబుకు అక్రమంగా పోస్టింగ్ ఇచ్చారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. ఆయన పోస్టింగ్ అంశంపై కోర్టుకు వెళ్తానని తెలిసే తనకు కేవియట్ నోటీస్ పంపించారని అన్నారు. అమ్మవారి సొమ్మును దోచుకున్న సురేష్ బాబుపై ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి వెల్లంపల్లి అండతో కనకదుర్గ ఆలయ నిధులను ఇష్టానుసారంగా దోచుకున్నారని దుయ్యబట్టారు.
సురేష్ బాబుపై ప్రభుత్వానికి అంత ప్రేమ ఎందుకు..? - minister vellampalli srinivas
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కనకదుర్గ ఆలయ మాజీ ఈవో సురేష్ బాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు జనసేన నేత పోతిన మహేష్. దేవాదాయశాఖలో సురేష్ బాబుకు అక్రమంగా పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు.
Janasena Pothineni Mahesh