ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లోపాలమయం... చేసింది శూన్యం... వైకాపా పాలనపై జనసేన నివేదిక - janasena party release report on ycp 100days governanace

వైకాపా వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. మొత్తం 9 అంశాలపై నివేదికను రూపొందించింది. ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించటంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి ఉందని ఆరోపించింది.

janasena party release report on ycp 100days governanace

By

Published : Sep 14, 2019, 12:05 PM IST


వైకాపా వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. వైఎస్ జగన్ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో ఎత్తి చూపింది. వైకాపా వంద రోజుల పాలన ప్రణాళికబద్ధంగా లేదని ఆరోపించింది. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు నివారణలో సన్నద్ధత లోపించిందని పేర్కొంది. వరద పరిస్థితుల అంచనాలో పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందని వెల్లడించింది.ఆర్థిక శాఖ గురించి సీఎం డ్యాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.
జనసేన నివేదికలో ఎత్తి చూపిన అంశాలు...
⦁ ఇసుక విధానం
⦁ పడకేసిన ప్రజారోగ్యం
⦁ రాజధాని నిర్మాణం, ప్రభుత్వ వైఖరి
⦁ గృహ నిర్మాణం
⦁ రాష్ట్రంలో శాంతి భద్రతలు
⦁ అన్నదాతల కష్టాలు
⦁ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
⦁ పోలవరం పనులు నిలిపివేత
⦁ పెట్టుబడులు ఆకర్షించటంలో విఫలం

వైకాపా వందరోజుల పాలనపై జనసేన నివేదిక

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details