ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లోక్‌సభ స్పీకర్ సుమోటోగా విచారణకు స్వీకరించాలి: నాదెండ్ల

ఎంపీ రఘురామ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై లోక్‌సభ స్పీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. ఎంపీ పట్ల ప్రభుత్వం అనుచితంగా వ్యవహరించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన పార్టీ
జనసేన పార్టీ

By

Published : May 16, 2021, 3:06 PM IST

ఎంపీ రఘురామ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని జనసేన ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై లోక్‌సభ స్పీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు.

ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని నాదెండ్ల మండిపడ్డారు. విచారణ పేరుతో ఎంపీతో అనుచితంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details