ఎన్నికల నియమాలను వైకాపా తుంగలో తొక్కి అవినీతికి పాల్పడుతోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ దుయ్యబట్టారు. సర్పంచ్ అభ్యర్థులను బెదింరించటం, ఆత్మహత్యలకు పురికొల్పటంలో వైకాపా నాయకులు నిమగ్నమయ్యారని అన్నారు. ఇవన్నీ చూస్తున్న పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి అవినీతిని ప్రశ్నించి , ప్రశ్నించి విసుగొస్తుందని ఆయన అన్నారు.
'పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే జరుగుతున్నాయి'
పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగానే జరుగుతున్నాయని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. పాత రేషన్ బియ్యానికి పాలిష్ వేసి అమ్ముతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని.. వైకాపా ఆగడాలను పోలీసులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్
అతిపురాతనమైన విజయేశ్వర స్వామి గుడి ప్రాంగణాన్ని షాపింగ్ కాంప్లెక్స్గా మారుస్తుండటం దారుణమని మండిపడ్డారు. అట్టహాసంగా ప్రారంభించిన నాణ్యమైన బియ్యం పంపిణీ ఓ బోగస్ అని ఎద్దేవా చేశారు. దెందులూరులోని మహిళా జనసేన నాయకురాలి పట్ల ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి దురుసు ప్రవర్తన పట్ల చర్యలుండవా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి:'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'