ప్రజల డబ్బులతో ఇచ్చే పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవడం ఏమిటని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు.. పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి జాతీయ నేతల పేర్లు పెడతామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Pawan Kalyan: ప్రజాధనంతో ఇచ్చే పథకాలకు సొంత పేర్లా?: పవన్‌కల్యాణ్
ప్రజాధనంతో ఇచ్చే పథకాలకు సొంత పేర్లు ఎలా పెట్టుకుంటారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు.. జాతీయ నేతల పేర్లు పెడతామని వెల్లడించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరయ్యారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్
రాజకీయ నేతలంటే పేకాట క్లబ్‌లు నడిపేవారు, సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు దోచుకునే వారు కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ..Sand Art: పోరాట యోధుల త్యాగాలు.. ఆకట్టుకున్న శాండ్ ఆర్ట్