పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం సమయానికి డబ్బు చెల్లించక అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రబీ ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.4 వేల కోట్ల మేర ప్రభుత్వం బకాయి ఉందని తెలిపారు. ఆ సొమ్ములు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పిన ప్రభుత్వం.. 28 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు.
'కేంద్రం నిధులను పక్కదారి పట్టించారు' - Janasena leader Nadendla Manohar questioned on farmer issues
వైకాపా ప్రభుత్వం అన్నదాత కంట కన్నీరు పెట్టిస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం.. సకాలంలో డబ్బు చెల్లించటం లేదని విమర్శించారు.
జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్
రైతులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ములను అడుగుతుంటే ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి ఆ నిధులు విడుదల కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరించడమే కారణమన్నారు. ముందుగానే ఆ నిధులను పొంది.. ఇతర కార్యక్రమాలకు మళ్లించారని ఆరోపించారు.
ఇదీ చదవండీ.. GVMC: యూజర్ చార్జీలు, చెత్తపై పన్ను వసూలుకు జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం